Search
Monday 24 September 2018
  • :
  • :

ముగ్గురిని బలిగొన్న ట్రాన్స్‌ఫార్మర్

పలువురికి గాయాలు, జోగులాంబ జిల్లా గట్టు మండలంలో విషాదం

transformerగద్వాల ప్రతినిధి/గట్టు: పొలం వద్ద నూతన ట్రాన్స్ ఫార్మర్‌ను అమర్చే క్రమం లో విద్యుదా ఘాతానికి గురై ముగ్గురు మృతి చెం దగా, పలువురు గాయప డిన సంఘటన జోగులాం బ జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉరుకుం దు(35), ఈదన్న(40), బుడ్డన్న (45), పెద్ద నర్ప ప్ప(50) శుక్రవారం తమ పొలం వద్ద నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ తీగలను అనుసంధానం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫార్మర్‌కు నేరుగా విద్యు త్ సరఫరా అయింది. అదే సమయంలో  ఉరుకుందు, ఈద న్న, బుడ్డన్న, పెద్దనర్సప్పలు ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఉం డడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో పెద్దనర్సప్ప తీవ్రంగా గాయపడగా, మిగిలిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన నర్సప్పను చికిత్స నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం గురించి తెలుసుకున్న టిఆర్‌ఎస్ పార్టీ గద్వాల ఇన్‌ఛార్జ్ బండ్లకృష్ణమోహన్‌రెడ్డి ఆలూరు గ్రామానికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. సంఘటన జరగటానికి గల కారణాలు కుటుంబ సభ్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విషయాన్ని కేరళ పర్యటనలో ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదారాబాదులో ఉన్న మరో మంత్రి లకా్ష్మరె డ్డిల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి స్పందిస్తు ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామి ఇచ్చారు. అదే విధంగా ఒక్కో కుటంబానికి రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే డీకే అరుణ ప్రమాదానికి గల కారణాలను ఫోన్ ద్వారా అడిగి తెలుసు కున్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణ చేసి నిర్లక్షంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. అదే విధంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని గద్వాల ఎంపీపీ సుభాన్ ఆసుపత్రిలో పరామర్శించారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
విద్యుదాఘాతంతో యువ రైతు మృతి
మన తెలంగాణ/తాడ్వాయి(నిజామాబాద్ జిల్లా): రాజంపేట మండలం గుండారం గ్రామ పంచాయతీ పరిధిలో లేత మామిడి తండాలో విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. లేత మామిడి తండా వాసి గుగ్లోత్ దూప్ సింగ్ (40) తన వ్యవసాయ బోరు మోటార్ బటన్ నొక్కగా విద్యుత్ సరఫరా కాలేదు. దీంతో సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలించగా ఫ్యూజ్ పోయినట్లు గమనించాడు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వైరు వేసే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురై కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం వద్దకు వెళ్లిన దూప్‌సింగ్ ఎంతకు ఇంటికి రాకపోవడంతో పొలం వద్దకు వెళ్లిన మృతుని భార్య పారింగాకు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద దూప్‌సింగ్ నిర్జీవంగా కన్పించాడు. దీంతో కుటుంబ పెద్ద చనిపోవడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య పారింగా, కుమారులు తారచంద్, కుమార్‌లు ఉన్నారు.

Comments

comments