Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

3 నెలల కనిష్ఠానికి సెన్సెక్స్

99999999999*220 పాయింట్లు డౌన్,
*చమురు ధరల పతనం ప్రభావం
*జిఎస్‌టి, ఫెడ్ ఆందోళనలతో దెబ్బతిన్న సెంటిమెంట్

ముంబయి : ఐదో రోజు నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్ సూచీ లు మూడు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. సెన్సెక్స్ 220 పాయిం ట్లు నష్టపోయి 25310.33 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 64 పాయింట్లు పడిపోయి 7701.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. జిఎస్ టి బిల్లుపై తాజా ఆందోళనలు, కొన్ని సంవత్సరాల కనిష్ఠానికి చము రు ధరలు పడిపోవడం, అమెరికా ఫెఢ్ భయాలతో దేశీయ మార్కెట్లు నష్టపోయాయని నిపుణులు అంటున్నారు. ముడి చమురు ఉత్పత్తిని తగ్గించబోమని ఒపెక్ తీసుకున్న నిర్ణయం, ఆసియా మార్కెట్లలో కొను గోలు సెంటిమెంట్ నశించగా, అదే దారిలో భారత్ నడిచింది. అంత ర్జాతీయంగా చూస్తే ఉత్పత్తిని తగ్గించేది లేదని ఒపెక్ నిర్ణయించడంతో చమురు ధరలు ఏడేళ్ల కనిష్ఠానికి పడిపోగా, ఇదే దారిలో బిఎస్‌ఇ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 2.14 శాతం డౌన్ అయింది. 30 షేర్ల సెన్సెక్స్‌లో గెయిల్ అత్యంత దారుణంగా నష్టపోయింది. ఆ తర్వాత వేదాంత, హిందాల్కో, టాటా స్టీల్, ఒఎన్‌జిసి పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1.08 లక్షల కోట్లు కరిగిపోయింది. విదేశీ ఫండ్ల అవుట్ ఫ్లో, రూపాయి బల హీనం వంటి కారణాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బిఎస్‌ఇలో మిడ్ క్యాప్ 1.17 శాతం, స్మాల్ క్యాప్ 1.33 శాతం నష్ట పోయాయి. ఎన్‌ఎస్‌ఈలో తొమ్మిది కంపెనీలు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ప్రభుత్వం, ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్‌ల మధ్య విభేదాల వల్ల జిఎస్‌టి బిల్లు ఆమోదంపై మరోసారి నీలిమేఘాలు కమ్ముకున్నాయి. హెచ్‌సిఎల్ టెక్, టాటా మోటార్స్, బోష్ లిమిటెడ్, టిసిఎస్, బజాజ్ ఆటో తదితర కంపెనీలు లాభపడగా, కెయిర్న్, గెయిల్, విఇడిఎల్, డాక్టర్ రెడ్డీస్, ఒఎన్‌జిసి తదితర కంపెనీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 97,79,857 కోట్లుగా ఉండగా, అది రూ. 96,71,518 కోట్లకు తగ్గింది. మొత్తం 2,903 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 877 కంపె నీలు లాభాలను, 1,879 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి. చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, అదే సమయంలో అ మెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేటు పెంచనుందనే సంకేతాలు వెరసి మార్కెట్‌ను పతనం దిశగా నడిపించాయి. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్ వంటి ఆసియాలోని కీలక సూ చీలు 0.75-1.89 శాతం మధ్య నష్టపోయాయి.

Comments

comments