Home తాజా వార్తలు స్కూల్‌ బస్సు కిందపడి బాలుడు మృతి

స్కూల్‌ బస్సు కిందపడి బాలుడు మృతి

3 Year Old Boy died in School Bus Accident in Hyderabad

హైదరాబాద్: స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతిపేట గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. శాంతినికేతన్ పాఠశాలకు చెందిన బస్సు కింద పడి బుర్ర తన్వీష్(3) అనే బాలుడు మృతి చెందాడు.  రోడ్డు మీద ఆడుకుంటున్న బాబును గమనించని బస్సు డ్రైవర్ బస్సును చిన్నారి మీది నుంచి పోనియడంతో అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.