Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

టాలీవుడ్ యంగ్ హీరో తండ్రికి మూడేళ్ళ జైలు!

jail

విశాఖపట్నం: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ తండ్రి నిడమర్తి బ‌స‌వ‌రాజుకి కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. బ్యాంకులో పని చేస్తూ, నకిలీ బంగారాన్ని తాక‌ట్టు పెట్టి రుణం పొందిన కేసులో బసవరాజుకు ఈ శిక్ష పడింది. వైజాగ్లోని వేపగుంట ప్రాంతానికి చెందిన బసవరాజు (53) సింహాచలం స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్ బిఐ)లో 2013లో అసిస్టెంట్‌ క్యాషియర్‌గా విధులు నిర్వహించేవారు. ఆ సమయంలో త‌న భార్య రాజ్య‌ల‌క్ష్మీ పేరుతో పాటు ఎం.ఎస్‌.ఎన్‌.రాజు, సన్యాసి రాజు, సాంబమూర్తి వెంకట్రావుల పేర్ల మీద న‌కిలీ బంగారం తాక‌ట్టు పెట్టి 9.85 ల‌క్ష‌ల రూపాయ‌లు రుణం  తీసుకున్నారు. అయితే బ్యాంక్ అధికారుల త‌నిఖీల్లో ఆ బంగారం న‌కిలీది అని తేల‌డంతో  బ‌స‌వ‌రాజుపై బ్యాంక్ మేనేజ‌ర్ గ‌రికిపాటి సుబ్ర‌హ్మ‌ణ్యం గోపాల‌ప‌ట్నం పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బసవరాజుపై గోపాల‌ప‌ట్నం పిఎస్ లో చీటింగ్ కేసు న‌మోదైంది. ఈ కేసు శుక్రవారం విచార‌ణ‌కి వచ్చింది. దీంతో మేజిస్ట్రేట్ స‌న్నీ ప‌ర్విన్ సుల్తానా బేగం రాజ్ త‌రుణ్ తండ్రి బ‌స‌వ‌రాజుకి మూడేళ్ళ జైలు శిక్ష‌తో పాటు 20వేల రూపాయ‌ల జరిమానా విధించారు. ఇక రాజ్ తరుణ్ 2013లో ఉయ్యాల జంపాల మూవీతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తరువాత కుమారి 21ఎఫ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి విజయవంతమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

Comments

comments