Home తాజా వార్తలు 30 కిలోల గంజాయి పట్టివేత

30 కిలోల గంజాయి పట్టివేత

Marijuana

భద్రాద్రి కొత్తగూడెం : అక్రమంగా తరలిస్తున్న 30 కేజీల గంజాయిని ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. చత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న బస్సులో నలుగురు వ్యక్తులు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పాల్వంచలో పట్టుకున్నట్టు ఆబ్కారీ పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు.

30 kg of Marijuana Seized