Home అంతర్జాతీయ వార్తలు ఆత్మాహుతి దాడుల్లో 30 మంది మృతి

ఆత్మాహుతి దాడుల్లో 30 మంది మృతి

Suicide-Attacks
కనో (నైజీరియా): బొకోహరం ఉగ్రవాద సంస్థ జిహాదీలు జరిపిన మూడు ఆత్మాహుతి దాడుల్లో 30 మంది మరణించారు. ఆదివారం రాత్రి ఈశాన్య నైజీరియా ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగిందని ఎమర్జన్సీ సర్వీసులు తెలిపాయి. ‘ఆత్మాహుతి దాడుల్లో ఇప్పటివరకూ మరణించినవారి సంఖ్య 30కి చేరింది. 40 మంది గాయపడ్డారు’ అని ప్రభుత్వ అత్యవసర కార్యకలాపాల నిర్వహణ సంస్థ (సెమా) అధిపతి ఉస్మాన్ కచల్లా సోమవారం చెప్పారు. మొదట అందిన సమాచారం ప్రకారం 17 మంది మరణించారు. 17 మంది గాయపడ్డారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండుగలో కొందరు ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగా ముగ్గురు బాంబర్లు హాలు బయట తమను తాము పేల్చుకున్నారు.

30 Killed in Triple Suicide Bombing ​in Nigeria