Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఉత్తర కొరియాలో రోడ్డు ప్రమాదం : 30మంది మృతి

30 People died in Road Accident at North Korea

ఉత్తర కొరియా : ఉత్తర కొరియాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హువాన్‌ఘై హైవేపై అదుపు తప్పిన ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. రోడ్డు నిర్మాణం పనులతో పాటు వాతావరణం సరిగా లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. చైనీస్ ట్రావెల్ కంపెనీ సభ్యులు ఈ బస్సులో ఉన్నారు. నార్త్ కొరియాలో ఉన్న చైనీస్ ఎంబసీ ఈ ఘటనను ధృవీకరించింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

30 People died in Road Accident at North Korea

Comments

comments