Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

యుపిలో భారీ వర్షాలు: 43 మంది మృతి

Heavy-Rains-in-UP

లక్నో: ఉత్తర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంలో 43 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఆగ్రాలో ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు కురుస్తుండటంలో అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆగ్రాలో ఐదుగురు, మణిపూర్ లో నలుగురు, ముజాఫర్ నగర్, కశ్ గంజ్ లో ముగ్గురు , మీరట్, బరేలీ లో ఇద్దరు, కాన్పూర్, మథుర, ఘజియాబాద్, జాన్సీ, రాయ్ బరేలీ, జౌన్ పూర్ ప్రాంతాలలో ఒకరు మృతి చెందారు.   కొన్ని ప్రాంతాలలో  కొండచరియలు విరిగిపడి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ వ్యవస్థతో పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్  ఆదేశించారు. ఉత్తర భారత దేశంలో యుపి, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరించారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

Comments

comments