Search
Tuesday 17 July 2018
  • :
  • :
Latest News

300 అక్రమ ర్యాంకులు

scam

300 అక్రమ ర్యాంకులు భారీ శ్కాంసెట్

తవ్విన కొద్దీ కొత్త షాక్‌లు, నాగోల్‌లోని కార్పొరేట్ కళాశాలే కేంద్రం
బెంగళూరు, ముంబయి, పుణె, షిరిడీ, కోల్‌కతా, భువనేశ్వర్‌లలో క్యాంపులు నిర్వహించి ప్రశ్నాపత్రాల లీక్
దొంగ ర్యాంకులు పొందిన విద్యార్థుల కోసం పోలీసుల వేట

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ ఎం సెట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆశ్చర్యకర నిజాలు తాజాగా వెలుగు చూశాయి. హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఉన్న ఓ కార్పొరేట్ కళాశాల నుంచి మూడేళ్లలో 300 మంది విద్యార్థులు దొడ్డి దారిన ర్యాంకులు పొం దారని సిఐడి తాజా దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు దేశంలోని ఆరు ప్రాంతాలైన బెంగళూరు, ముంబయి, పుణె, షిరిడి, కోల్‌కత్త, భువనేశ్వర్‌ల లో క్యాంప్‌లు నిర్వహించి విద్యార్థులకు ప్రశ్నపత్నం లీక్ చేశారని తేలింది. హైదరాబాద్‌లోనూ క్యాంప్ నిర్వహించినట్లు తాజాగా బయటపడిం ది. ఈ వ్యవహారంలో ఇటీవల సిఐడి పోలీసులకు పట్టుబడిన శ్రీచైతన్య కళాశాల డీన్ వాసుబాబు, ఆ కళాశాల ఏజెంట్ వెంకట శివనారాయణ, మెడికో గణేష్ ప్రసాద్ పాత్ర ఉందని సిఐడి పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వీరిని కస్టడీ కోరు తూ సిఐడి పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఈ ముగ్గురు నిందితులను రెండు మూడు రోజుల్లో కోర్టు ఆదేశాల మేర కు సిఐడి పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ఈ కుంభకోణంలో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, కళాశాల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, న్యాయవాదులు, డాక్టర్లు, ఏజెంట్లను మాత్రమే అరెస్టు చేసిన సిఐడి పోలీసులు తాజాగా దొడ్డి దారిన ర్యాంకులు పొందిన 300 మంది విద్యార్థులను ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయా కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న వీరిని గుర్తించే పనిలో సిఐడి అధికారులు మునిగిపోయారు. ఈ మేరకు కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నారు. దీంతో దొడ్డి దారిన ర్యాంకులు పొందిన విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నా యి. ఇప్పటికే వీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ ఎంబిబిఎస్ చదువుతున్నారు. పై ముగ్గురు నిందితులు మూడేళ్ల నుంచి దొడ్డి దారిన విద్యార్థులకు ర్యాంకులను సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించినట్లు సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం వీరు ఒక్కో విద్యార్థి నుంచి ఎంతెం త డబ్బులు తీసుకున్నారు, కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్ల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు ఎంసెట్ స్కాంలో దేశంలో ఆరు క్యాంపుల ద్వారా విద్యార్థులకు ప్రశ్నపత్రం లీక్ చేశారని తేలింది. తాజాగా నాగోల్‌లో కూడా క్యాంప్ నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ క్యాంప్‌ను వాసుబాబు, వెంకట శివనారాయణ, గణేష్ ప్రసాద్‌ల నేతృత్వంలో కొనసాగినట్లు సిఐడి పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురు నిందితుల కస్టడీ పూర్తయిన అనంతరం చార్జీషీట్ పూర్తి చేసి కోర్టుకు అప్పగిస్తారు.

Comments

comments