Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పాక్‌లో 310 మందికి ఉరి శిక్ష అమలు

HANGINGకరాచీ : పెషావర్ ఉగ్రదాడి ఘటనతో పాకిస్థాన్‌లో ఉరిశిక్ష పడిన ఖైదీలకు ఉరిశిక్ష అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేర్వేరుజైళ్లలో ఉన్న ఎనిమిదిమంది ఖైదీలను మంగళవారం ఉరి తీశారు. దీంతో ఈ ఏడాది కాలంలో ఇప్పటివరకు 310మందికి ఉరిశిక్ష అమలు చేశారు. ముల్తాస్, బహవల్పూర్, గుజరాత్ తదితర జైళ్లలో ఉన్న ఎనిమిది మంది ఖైదీలను ఉరి తీసినట్టు పాకిస్థాన్ అధికారులు తెలిపారు. పెషావర్‌లోని సైనిక పాఠశాలలో డిసెంబరు 16, 2014న ఉగ్రవాదులు నరమేథం సృష్టించారు. ఈ ఘటనలో 150 మంది చనిపోయారు. ఇందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. పెషావర్ ఘటన బాధ్యులను ప్రాణాలతో వదిలిపెట్టకూడదని నిశ్చయించుకున్న పాక్ ప్రభుత్వం ఉరిశిక్షలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. మార్చి 10న ఉరిశిక్షలను అమలు చేయడం ప్రారంభించారు. కానీ ఉరిశిక్షలను నిలిపివేయాలని యూఎస్, ఈయూ, మానవహక్కుల సంఘాలు కోరాయి. కానీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోబోమని ఖరాఖండీగా తేల్చి చెప్పింది. ఉగ్రవాదాన్ని కట్టుడి చేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

comments