Home తాజా వార్తలు కవిత గెలుపు… టిఆర్‌ఎస్‌కు మలుపు

కవిత గెలుపు… టిఆర్‌ఎస్‌కు మలుపు

maloth Kavitha

 

 బయ్యారం: టిఆర్‌ఎస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్ధి మాళోత్ కవిత గెలుపు తో టిఆర్‌ఎస్‌కు మలుపు ప్రారంభమైనట్లేనని ఇల్లందు మాజి ఎంఎల్‌ఏ కోరం కనకయ్య, హరిసింగ్ నాయక్, ఇల్లందు నియోజక వర్గ ఇన్‌చార్జి జిసిసి కార్పోరేషన్ చైర్మన్ మోహన్‌గాంధీ నాయక్‌లు తెలిపారు. మంగళ వారం లక్ష్మీనర్సపురం లో ఉదయం 6గంటలకు ప్రారంభమైన ప్రచారంలోభాగంగా ఉప్పాలపాడు గ్రామ పంచాయితీలో టిఆర్‌ఎస్ పార్టి జెండా ఎగురవేసి వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను కేంద్రం నుండి రాబట్టు కోవాలంటే టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్ధులను భారీ మోజార్టితో గెలిపించాలని కోరారు. నర్సతండ, మాన్యతండ, చోక్లతండ, వెంకటాపురం, బయ్యారం గ్రామ పంచాయితీల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రోడ్డు షోలు నిర్వహించారు. బయ్యారం లో మహిళలు పూలమాలతో బతకమ్మలతో హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అమరవీరులకు కవిత, మాజి ఎంఎల్‌ఏ కోరం కనకయ్య, ఎంపిపి జయశ్రీ, గాంధీనాయక్ లు, పార్టి శ్రేణులు పూలమాలతో నివాళులు అర్పించారు. రోడ్డు షోలో కవిత మాట్లాడుతూ… తెలంగాణలో అమలులో ఉన్న అనేక సంక్షేమ పథకాలను యావత్ దేశం కీర్తిస్తోందన్నారు. అభివృద్ది, సంక్షేమం పథకాలు అన్ని వర్గాలకు చేయూతగా మారాయన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టి సాధించే దిశగా ఓటుర్లు విజ్ఞత తో ఓటు వేయాలని వారు కోరారు. ఎంఎల్‌ఏ, ఎంపి జోడెడ్ల వలే ఒకే పార్టిలో ఉన్నప్పుడే అభివృద్ది వేగంగా సాగుతుందాన్నారు.గంధంపల్లి లో కడియాల వెంకట్రామాయ్య ఆధ్వార్యంలో మహిళలు, కార్యకర్తలు హారతులతో స్వాగతం పలికారు, అనంతరం నృత్య డ్యాన్స్‌లతో ప్రచారంలో కారు గుర్తుకే మన ఓటు వేసి గెలిపించాలని పేర్కన్నారు. ఎన్నికల ప్రచారంలో  కార్యక్రమంలో బాగంగా ఎంపిపి.జయశ్రీ, బయ్యారం మేజరు గ్రామ పంచాయితీ సర్పంచ్ కోటమ్మ, ఉప సర్పంచ్ వీరబోయిన కవిత,  గణేష్, రాసమాల నాగేశ్వరావు, బానోత్ మురళి కృష్ణ,మాజి సర్పంచ్ శ్రీనివాస్, సోమిరెడ్డి, సంకు సత్తిరెడ్డి, ఏనుగుల ఐలయ్య, నాగేశ్వరావు, మళికార్జున్, చంత వెంకటరమణ కొత్తగూడెం సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, నాయకులు కార్యకర్తలు ప్రజలు తండోపతండాలుగా పాల్గొని విజయవంతం చేశారు.

Trs Mp Candidate maloth Kavitha Election Campaign at Bayyaram