Home ఆంధ్రప్రదేశ్ వార్తలు పాసింజర్‌ రైలు విద్యుదాఘాతం: నలుగురికి గాయాలు

పాసింజర్‌ రైలు విద్యుదాఘాతం: నలుగురికి గాయాలు

vejendla-railway-station

అమరావతి: విద్యుదాఘాతంతో నలుగురు ప్రయాణికులు గాయపడిన సంఘటనా ఒంగోలు నుంచి గుంటూరు పాసింజర్‌ రైలులో జరిగింది. గుంటూరు జిల్లా వేజెండ్ల రైల్వే స్టేషన్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం…ఒంగోలు నుంచి గుంటూరు వెళుతున్న పాసింజర్‌ రైలు వేజెండ్ల రైల్వేస్టేషన్‌కు చేరుకొన్నది. రైల్వే స్టేషన్ లో పాసింజర్‌ రైలు నుంచి ప్రయాణికులు దిగుతుండగా పుట్‌బోర్డు వద్ద ఉన్న గ్రిల్స్‌కు విద్యుత్‌ సరఫరా అయింది. దీంతో ప్రయాణికులకు విద్యుత్ షాక్ తగిలి ప్లాట్‌ఫాం పై పడిపోయారు. ఘటనను గమనించిన పాసింజర్‌ రైల్వే గార్డు రైలులోని విద్యుత్‌ సరఫరాను నిలిపి వేశాడు. దీంతో పెనుప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రేల్వే అధికారులు విచారణ ప్రారంభించారు.

four passengers Injured With Electric Shock In Train