Home తాజా వార్తలు డీర్ ఎజార్ పై రష్యా దాడి: 57 మంది మృతి

డీర్ ఎజార్ పై రష్యా దాడి: 57 మంది మృతి

                     Russia

డమాస్కస్: సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు తలదాచుకున్న డీర్ ఎజార్ ప్రాంతంపై రష్యా సైన్యం వైమానిక దాడులు చేసిన ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడులో 57 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో  19 చిన్నారులు, 9 మంది మహిళలు ఉన్నారని రష్యా సైన్యం వెల్లడించింది.  ఐసిస్ ఆధీనంలో ఉన్న కొన్ని ప్రాంతాలను రష్యా దాడులు చేస్తూ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. 2015 నుంచి సిరియా అధ్యుక్షుడు బషల్ అల్ అసద్ తో రష్యా మంచి మిత్ర దేశంగా కొనసాగుతోంది. సిరియాలో చెలరేగిన అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు లక్షలాది మంది చనిపోయిన విషయం తెలిసిందే.