Home జాతీయ వార్తలు మహాదేవుడి మహా విగ్రహం

మహాదేవుడి మహా విగ్రహం

Lord Shiva Statueజైపూర్: దేశంలో మరో భారీ విగ్రహ నిర్మాణం జరుగుతోంది. రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం రూపుదిద్దుకుంటుంది. దీని ఎత్తు 351 అడుగులు. ఇది ప్రపంచంలోనే 4వ ఎత్తైన విగ్రహం. 2012 ఆగస్టులో అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు దాదాపు 80శాతం విగ్రహ పనులు పూర్తి కావొచ్చాయి. విగ్రహ తయారీలో సుమారు 3000 టన్నుల స్టీల్ వాడుతుండగా మొత్తం విగ్రహం బరువు 30వేల టన్నులు. మహాదేవుడి చేతిలోని త్రిశులం పొడువు 315 అడుగులట. ఇక ఈ విగ్రహ ఆవిష్కరణ అనంతరం రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని రాజస్థాన్ సర్కార్ అభిప్రాయపడుతోంది.

351 feet long Shiva statue in Rajasthan