Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

పంజాబ్ ఖాతాలో మరో విజయం

Punjab

మొహాలి: వేదికగా కింగ్స్‌లెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య జరిగిన ఐపిఎల్ 36వ మ్యాచ్‌లో పంజాబ్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 17.1 ఓవర్లలో కేవలం 67 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టారు. పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ ఢిల్లీ బ్యాట్స్‌మెన్లను హడాలెత్తించాడు.

నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, వరుణ్ అరోన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 68 పరుగుల స్వల్ప లక్షంతో బరిలోకి దిగిన పంజాబ్ 8 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా టార్గెట్‌ను చేధించింది. గుప్టిల్(50), ఆమ్లా(16) పరుగులు చేశారు. నాలుగు వికెట్లు తీసిన సందీప్ శర్మకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Comments

comments