Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ప్రజావాణికి 37 దరఖాస్తులు

PRAJAVANI

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట ఆర్డీవొ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 37 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలక్టర్ వెంకటరామిరెడ్డి ప్రజలిచ్చిన ధరఖాస్తులను స్వీకరించడమే కాకుండా వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలపై స్పందించి అక్కడిక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ధరఖాస్తులను ఆయా శాఖలకు, ఆయా మండలాలకు పంపారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలిచ్చిన ధరఖాస్తులను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. రెవెన్యూ భూ సంబందిత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తు వాటి వివరాలను తనకు అందేజేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి కలక్టర్ చేనేత వస్త్రాలను ధరించి హాజరవడం విశేషం. ఈ కార్యక్రమంలో జెసీ హన్మంతరావు, డిఆర్వొ చంద్రశేఖర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

comments