Home బిజినెస్ 37 లక్షల జిఎస్‌టిఆర్-3బి రిటర్నుల దాఖలు

37 లక్షల జిఎస్‌టిఆర్-3బి రిటర్నుల దాఖలు

gstn

న్యూఢిల్లీ:  సెప్టెంబరు నెలకు వస్తు,సేవల పన్ను పాలన(జిఎస్‌టిఆర్) 3బి రిటర్నులు దాఖలు చేయడానికి విధించిన గడువు శుక్రవారంతో ముగిసింది. దాదాపు 37 లక్షల జిఎస్‌టి రిటర్నులు దాఖలయ్యాయని, 75,000 అమ్మకాల డేటా జిఎస్‌టిఎన్ పోర్టల్‌కు అప్‌లోడ్ అయ్యాయని జిఎస్‌టిఆర్ చైర్మన్ అజయ్ భూషణ్ పాండే చెప్పారు. సిఎస్‌టిఎన్ విధానం స్థిరంగా ఉందని, 20 లక్షల రిటర్నుల సామర్థంలో 30 శాతం డేటాను రెండు రోజుల్లో నిర్వహించి అప్‌లోడ్ చేశామని కూడా ఆయన తెలిపారు. రిటర్నుల దాఖలు ఊపందుకుంటోందని పాండే చెప్పారు. ప్రజలు సకాలంలో రిటర్నులు దాఖలు చేస్తారన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. జిఎస్‌టి జులై 1 నుంచి అ మలవుతోంది. వాణిజ్య సంస్థలు జిఎస్‌టిఆర్3బి రిటర్ను లు దాఖలు చేసే మూడో నెల ఇది. జులై నెలలో 55.68 లక్షల రిటర్నులు, ఆగస్ట్‌లో 50 లక్షల రిటర్నులు  దాఖలయ్యాయి. వాటివల్ల రూ. 95 వేల కోట్లు, రూ. 92 వేల కోట్ల  ఆదాయం సమకూరింది. మొదటి రెండు నెలల వ్యా పారం డేటాను అప్‌లోడ్ చేశామని, సెప్టెంబర్ రిటర్నుల డేటాను కూడా పూర్తిగా అప్‌లోడ్ త్వరలో చేస్తామని అజ య్ భూషణ్ పాండే తెలిపారు. జిఎస్‌టిఆర్3బి రిటర్నులను ప్రతి తదుపరి నెల 20 తేదికల్లా దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే సెప్టెంబర్ నెల రిటర్నులు అక్టోబర్ 20 కల్లా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. జిఎస్‌టి నెట్‌వర్క్(జిఎస్‌టిఎన్)లో ఏర్పడిన సమస్యల  వల్ల జులై నెలలో జిఎస్‌టిఆర్3బి దాఖలు చేయడం ఇబ్బందికరంగా మారింది. దాంతో ప్రభుత్వం గడువు తేదీని పొడిగించక తప్పలేదు. పైగా లేట్ పేమెంట్ ఫీజును కూడా రద్దు చేసింది. అయితే ఆగస్ట్ రిటర్నుల దాఖలు గడువుకల్లా నెట్‌వర్క్ బాగానే పనిచేసింది. సిఎస్‌టిఎన్‌లో ఏర్పడిన సమస్యను పరిశీలించేందుకు  బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ ఆధ్వర్యం లో మంత్రుల బృందం  రెండుసార్లు సమావేశం అయింది.