Home తాజా వార్తలు హరిత పతాక

హరిత పతాక

38 lakh acres of land through the Kaleshwaram project

మనతెలంగాణ/సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో  కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 38 లక్షల ఎకరాలకు సాగునీటిని ఈ ఏడాది చివరి నాటికి అందిస్తామని,  రైతుకు సాగు, తాగునీటితో పాటు పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, దేశంలో సరికొత్త హరిత విప్లవానికి తెలంగాణ ఆదర్శం కానుందని ఐటి, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్, గూ డెం, తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో గురు వారం నిర్వహించిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు.  నాలుగేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో రైతులు తీవ్ర నిర్లక్షానికి గురికాగా తెలంగాణ ఏర్పడిన తర్వా త రైతుల కష్టాలను దూరం చేసేందుకు సిఎం కెసిఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. రైతాంగానికే కాదు అన్ని రంగాలకు కూడా 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో ప్రతిపక్షాల దుకాణం బంద్ అవుతుందన్నారు. రైతుబంధు పథకం అమలుతో రైతుల ముఖాల్లో ఆనందం తాండవిస్తుందని అది చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మంత్రి అన్నారు. వచ్చే యాసంగి పంట నాటికి రాజన్న సిరిసిల్ల జిల్లా వాసుల సాగుభూములకు గోదావరి జలాలు అందిస్తామన్నారు. రైతులకు ధీమాని చ్చేందుకు జూన్2 నుంచి రైతు బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నామని,రైతులు మరణిస్తే రూ.5 లక్షల లభిస్తాయన్నారు.
రాష్ట్రంలో ఉన్న 46 వేల చెరువులు మిషన్ కాకతీయ ద్వారా నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు.రాష్ట్రంలో కరెంట్, విత్తనాలు, ఎరువులు సరైన సమయానికే అందుతున్నాయని మంచి మనసున్న సిఎం కెసిఆర్ కావడం వల్ల వర్షాలు కూడా సకాలానికే వస్తున్నాయన్నారు.వ్యవసాయాన్ని పండుగలా చేయాలనే సిఎం కెసిఆర్ రైతు బంధుపథకం ప్ర వేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ రైతులు అప్పులపాలు కాకూడదనే సిఎం కెసిఆర్ రైతుబంధు ప్రవేశపెట్టారన్నారు. ఏడాదికి దసరా, దీపావళి ఒక్కసారి వస్తే రైతుబంధు చెక్కుల పంపిణీ పండుగ రెండు సార్లు వస్తుందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని రైతు బంధు అందులో ఒకటన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి బాల్క సుమన్, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.