Home జాతీయ వార్తలు 38 మంది ఉగ్రవాదులు హతం?

38 మంది ఉగ్రవాదులు హతం?

Surgical-Strikeన్యూఢిల్లీ : పాక్ నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం చేపట్టిన సర్జికల్ దాడుల్లో మొత్తం 38 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. బుధవారం అర్ధరాత్రి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం చేసిన దాడుల్లో మృతుల సంఖ్య స్పష్టమైన సమాచారం లేదు. కాగా.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ దాడుల్లో 38 మంది ఉగ్రవాదులు మృతి చెందగా.. మరో ఏడుగురు బందీ అయినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో భారత్ సైనికులు ఎవరూ గాయపడలేదు. భారత ఆర్మీ ప్రత్యేక దళం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30గంటల ప్రాంతంలో దాడిని ప్రారంభించి 4.30గంటల ప్రాంతంలో ముగించింది. ఈ దాడి ముగిసిన వెంటనే ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డిజిఎంఒ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ పాక్ ఈ విషయం చేరవేశారు. పాక్ కూడా భారత సైన్యం తమ భూభాగంలోకి చొరబడినట్లు ఒప్పుకుంది.