2జి, 3జి, 4జి…. ఇంటర్నెట్, స్మార్ట్ మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి సుపరిచతమైన పదాలే ఇవి. 4జి టెక్నాలజీతో రిలయెన్స్ జియో రికార్డులనే సృష్టించింది. అయితే… 2017 లోనే 4జిని తలదన్నేలా 5జి టెక్నాలజీ రానుంది.
దానికి సంబంధించిన లోగోను 3జిపిపి (Third Generation Partnership Project) టెక్నాలజీ సంస్థ రిలీజ్ చేసింది. 2020 వరకు ప్రపంచం మొత్తం 5జి టెక్నాలజీ ని ప్రవేశపెట్టడానికి 3జిపిపి సంస్థ ప్లాన్ చేస్తున్నది.
5జి టెక్నాలజీ తో ఇప్పుడున్న స్పీడ్ కన్నా హై డేటా స్పీడ్ అంటే 20 జిబిపిఎస్ (గిగా బైట్స్ పర్ సెకండ్ ) వరకు పొందే అవకాశం ఉంది. 2018 లో అధికారికంగా దీన్ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నా… 2017 లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రం 5జి టెక్నాలజీని లాంచ్ చేయనుంది 3జిపిపి.