Search
Sunday 18 November 2018
  • :
  • :

ముచ్చటైన జంట మూడవ చిత్రం

n-and-s

పెళ్లయిన తర్వాత నాగచైతన్య, సమంత కలిసి ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. ఏమాయ చేసావే, మనం వంటి సూపర్‌హిట్ చిత్రాల అనంతరం ఈ ముచ్చటైన జంట మూడవ చిత్రాన్ని చేయబోతోంది. షైన్ స్క్రీన్స్ పతాకం రెండో చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ‘నిన్ను కోరి’ వంటి ఫీల్‌గుడ్ ఫిలిమ్‌తో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది మాట్లాడుతూ “నాగచైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండడం ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. మా సంస్థ నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న ‘కృష్ణార్జున యుద్ధం’ ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం”అని అన్నారు.

Comments

comments