Home స్కోర్ కెరీర్‌లో అత్యుత్తమ 3వ ర్యాంకుకు కోహ్లి

కెరీర్‌లో అత్యుత్తమ 3వ ర్యాంకుకు కోహ్లి

kohliదుబాయ్: భారత టెస్టు క్రికెట్ సారథి విరాట్‌కోహ్లి తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. మొహాలిలో ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన తర్వాత ఐసిసి విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ జాబితాలో 833 రేటింగ్‌తో 3వ స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు అతడు 15వ ర్యాంకులో వున్నాడు. సిరీస్‌లో జరిగిన 3 మ్యాచుల్లో విరాట్ 405 పరుగులు చేయడంతో వేగంగా 12 స్థానాలు పైకి ఎగబాకాడు. ఏడాది కాలంగా అద్భుత ఫామ్‌లో వున్న కోహ్లి టి20ల్లో అగ్రస్థానం, వన్డేల్లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో రెండో ర్యాంకులో ఉన్న ఇంగ్లాండ్ యువ బ్యాట్స్‌మన్ జోరూట్, విరాట్‌ల మధ్య తేడా కేవలం 14 పాయింట్లే. సిరీస్ పూర్తయ్యే లోపు తన బ్యాట్‌ను మరింత ఝళిపించి పరుగులు రాబడితే విరాట్ నెంబర్ వన్ ర్యాంకుకు చేరడం ఖాయం. టీమిండియా జట్టులో నయావాల్ ఛతేశ్వర్ పుజారా 8వ స్థానంలో వున్నాడు. బౌలర్లు, ఆల్‌రౌండర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో వుండగా, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో 7, ఆల్‌రౌండర్ల జాబితాలో 4వ స్థానంలో వున్నాడు.