Home ఆంధ్రప్రదేశ్ వార్తలు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Road Accidentవిశాఖ : ఎస్‌.రాయవరం మండలం డి.అగ్రహారం వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. డి.అగ్రహారానికి చెందిన ఆర్‌.నవీన్‌(18), కె. వరప్రసాద్‌ (16), కార్తీక్‌ (16) బైక్ పై యలమంచిలి వెళ్తున్నారు. అగ్రహారం కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ వీరి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరు అక్కడికక్కడే మృతి చెందారు. వరప్రసాద్‌ మృతదేహాన్ని లారీ ఈడ్చుకెళ్లగా యలమంచిలి మండలం పులపర్తి వద్ద లభ్యమైంది. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. పోస్టుమార్టం కోసం నవీన్, వరప్రసాద్, కార్తీక్ మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

3Young Men dead in Road Accident