Home జాతీయ వార్తలు బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు…

బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు…

4 Day Bank Holiday Is Coming Up In Some States

న్యూఢిల్లీ: ఇప్పటికే దేశవ్యాప్తంగా నగదు కొరత వేధిస్తుండగా కరెన్సీ కష్టాలు మరింత పెరిగేలా బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. ఏప్రిల్ 28న నాల్గో శనివారం కాగా, 29 ఆదివారం, 30 బుద్ధ పౌర్ణమి, మే 1 మేడే. దీంతో దేశ రాజధాని  ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, బెంగాల్, మధ్యప్రదేశ్, యుపి, హర్యానాల్లో ఈ నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే, 30న(సోమవారం) మాత్రం మిగతా రాష్ర్టాల్లో బ్యాంకులు తెరిచే ఉంటాయని అధికారులు తెలిపారు. కాగా, తెలంగాణ, ఎపితోపాటు తమిళనాడు, కేరళ, కర్నాటక, గోవా రాష్ర్టాల్లో మంగళవారం కార్మిక దినోత్సం(మేడే) కారణంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది. అయితే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎటిఎంలలో నగదును ఉంచుతామని,  అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.