Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రక్తమోడిన రాజీవ్ రహదారి

రోడ్డు ప్రమాదంలో  నలుగురి మృతి,  15 మందికి గాయాలు 

అంత్యక్రియలకు వెళ్తూ తిరిగిరాని లోకాలకు..

Accident

గజ్వేల్: రాజీవ్ రహదారి మరోసారి రక్తమోడింది. సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మం డలం రిమ్మనగూడ వద్ద శుక్రవారం జరిగిన ఘో రరోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెం దారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురిలో మల్లేశం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా అంత్య క్రియలకుగాను మర్కూక్ మండలం పాముల పర్తికి చెందిన మృతుని భా ర్య కనకవ్వతో పాటు బంధువులు టాటా ఎసి వా హనంలో శుక్రవారం సాయంత్రం నాగపురికి బయలుదేరారు. రాజీవ్ రహదారిపై ఉన్న రిమ్మ నగూడ వద్ద మరొక వ్యక్తి రాక కోసం వాహనా న్ని ఆపుకున్నారు. అదే సమయంలో అతి వేగంగా సిద్దిపేట వైపు దూసుకు వచ్చిన ఒక లారీ ఆగి ఉన్న టాటా ఎసి వాహనాన్ని వెను కనుంచి ఢీకొట్టింది. దీంతో అందులో టాటాఎసి వాహనంలో ఉన్న వారంతా ఎగిరి రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో పాముల పర్తి గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు అక్కారం కిష్టయ్య(60), సాయమ్మ(50), పోచయ్య(40)లు అక్కడికక్కడే మృతి చెందగా, నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నర్సమ్మ (40)మృతి చెందింది. మరో 15 మంది గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే గజ్వేల్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను, క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్‌ల్లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన 12 మందికి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స చేశారు. అనంతరం స్వల్పగాయాలైన మరో ముగ్గురు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కెసిఆర్ దిగ్భ్రాం తి 
రిమ్మన్‌గూడ రోడ్డు ప్రమాదం ప్ర మాదం పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద మృతుల కు టుంబాలకు, గాయాలపాలైన వారికి సంతాపం వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వై ద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వారికి సరైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Comments

comments