Home హైదరాబాద్ భక్తులు 4 లక్షలు

భక్తులు 4 లక్షలు

4 Lakh Devotees Visit Khairatabad Ganesh

మన తెలంగాణ/సిటీబ్యూరో : దేశంలోనే పేరుగాంచిన ఖైరతాబాద్ వినాయకుడిని చూసి తరించేందుకు భక్తులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 4 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సెలవురోజు కావడంతో పాటు వాతావరణం కూడా రాకపోకలకు అనుకూలించడంతో సకుటుంబంగా విచ్చేసి వినాయకుడికి కానుకలు సమర్పించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.