Home అంతర్జాతీయ వార్తలు గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి

గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి

4 People died in Gas Cylinder Explosion

మనామ : బహ్రెయిన్‌లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బహ్రెయిన్‌లోని ఓ భవనం రెండో అంతస్తులో ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి భవనం పూర్తిగా నేలమట్టమైందని పోలీసులు తెలిపారు. భవన శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమోనని సహాయక బృందాలు గాలిస్తున్నాయి. అయితే మృతుల్లో ఎపికి చెందిన వారు ఉన్నారని వార్తలు రావడంతో సిఎం చంద్రబాబునాయుడు ఈ ఘటనపై ఆరా తీశారు. అయితే మృతుల్లో తెలుగువారు లేరని, అందరూ బంగ్లాదేశ్‌కు చెందిన వారేనని పోలీసులు వెల్లడించారు.

4 People died in Gas Cylinder Explosion