Home ఆంధ్రప్రదేశ్ వార్తలు టిడిపికి గుడ్ బై చెప్పిన నలుగురు ఎంపిలు

టిడిపికి గుడ్ బై చెప్పిన నలుగురు ఎంపిలు

TDPఢిల్లీ : టిడిపికి ఊహించని రీతిలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై ఢీలా పడిన టిడిపికి నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. తాము టిడిపికి రాజీనామా చేస్తున్నామని వారు తెలిపారు. ఈ క్రమంలో రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు  వారు లేఖ రాశారు. తమను ఒక గ్రూప్‌గా పరిగణించాలని వారు ఆ లేఖలో వెంకయ్యను కోరారు. రాజ్యసభ సభ్యులు సిఎం రమేశ్‌, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, టిజి వెంకటేశ్‌ రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాసిన వారిలో ఉన్నారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి మాజీ సిఎం చంద్రబాబునాయుడు తన కుటుంబంతో కలిసి యూరప్ కు విహారయాత్రకు వెళ్లారు. చంద్రబాబు అందుబాటులో లేని ఈ సమయంలో ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు టిడిపికి రాజీనామా చేయడంపై టిడిపిలో సంచలనమైంది.

4 Rajya Sabha Members Resign To TDP