Home జిల్లాలు వాళ్లు మాటలు పారిస్తే – మేం నీళ్లు పారించాం

వాళ్లు మాటలు పారిస్తే – మేం నీళ్లు పారించాం

minister-harish-roaనాగర్‌కర్నూల్: కెఎల్‌ఐ రెండు మూడు లిఫ్టు కాలువల్లో 4వేల క్యూసెక్‌ల నీరు పారాల్సి ఉండగా కాలువల పని సరిగ్గా కాకపోవటంతో తక్కువ నీరు పారుతుందని మోటార్లు అదనంగా ప్రారంభించి నీరు వదిలితే బయటికి వచ్చే పరిస్థితి ఉందని వెంటనే కాలువలు సరిచేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరిష్ రావు వెల్లడించారు. గుడిపల్లి గట్టు 3వ లిఫ్టు ప్రారంభోత్సవ అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. కెఎల్‌ఐ పథ కం ప్రారంభించిన నాటి నుండి టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కాలువల్లో మాటలు పారిస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వం తక్కువ సమయంలోనే నీరు పారించిందని అన్నా రు. కెఎల్‌ఐ లో 90 శాతం పనులు పూర్తి చేశామని మరో 1000 కోట్లు ఖర్చు పెడితే జిల్లా ప్రాజెక్టులు పూర్తి అవుతాయని కాంగ్రెస్ అబద్దపు ప్రచారం చేసింద న్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టులో 70 శాతం పనులు మాత్రమే జరిగాయని ఇప్పటికి 2 వేల కోట్లు మంజూరు చేసి పనులు చేస్తున్నామని మరో 3 వేల కోట్లు ఇచ్చి జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామి ఇచ్చారు. టిఆర్‌ఎస్‌కు పేరు వస్తుందన్న భయంతో పాలమూరు భూసేకరణకు అడ్డు తగు లుతున్నారని జిల్లా విభజనలు ఆశాస్త్రీయమని కోర్టుకు వెళ్తామని పిసిసి అధ్య క్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి గురించి మాట్లాడుతూ కెఎల్‌ఐ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 4 వేల కోట్లు వ్యయం దాటిందని దీనికి గాను టిడిపి హాయంలో కేవలం 12 కోట్లు మా త్రమే ఖర్చు చేశారని మరి టిడిపిలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి నాగం జనా ర్ధన్ రెడ్డి చేసిన ఘనకార్యం ఏంటో ప్రజలు ఆలోచించాలని హరీశ్‌రావు అన్నారు. ఈ బహిరంగ సభకు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అధ్యక్షత వహించగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపి జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కు చెందిన పలువురు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీలు పాల్గొన్నారు.
రైతుల కళల్లో ఆనంద వెల్లువ
మహాత్మ గాంధీ ఎత్తిపోతల పథకం మూడవ లిఫ్ట్టు భారీ నీటి పారుదల శాఖ మం త్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంప్ హౌజ్ ముందు ఫైలాన్‌ను ప్రారంభించి అనంతరం పంప్ మోటారులను కంప్యూ టర్ స్విచ్ ద్వారా ప్రారంభించారు. అనంతరం గట్టుపై ఏర్పాటు చేసిన ఫైలా న్‌ను కుడా ప్రారంభించి నీటి పంపింగ్, రిజర్వాయర్ నీటి నిల్వను పరిశీలిం చారు. అక్కడికి వచ్చిన రైతులు, మహిళలతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా హజరైన ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రిజర్వాయర్ ఆనకట్టుపై చీమల దండులా దర్శనమివ్వటం రైతుల ఆనందోత్సహాలకు అవదులు లేకుండా పోయింది. ముసలి ముతక కుడా జలశయాన్ని చూసేందుకు వచ్చారు. జలశయంలోకి దిగి పుష్కరస్నానం అచరించారు. సాగునీటి కోసం పుష్కర కాలంగా వేచి చూస్తా మని నేడు రైతుల కళ నేరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీలు తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభలో అ ధికారులకు, ఇంజనీర్లు అహర్నిశలు, చమటోర్చి దిగ్విజయంగా పూర్తి చేసినం దుకు వారిని శాలువలతో మంత్రి హరీశ్‌రావును సత్కరించారు.