Search
Sunday 23 September 2018
  • :
  • :

ఆకుపచ్చని దీక్ష

హరితహారంలో పాల్గొనడానికి ముందుకొచ్చిన హైదరాబాద్ పరిధిలోని 40కి పైగా కేంద్ర సంస్థలు, వర్శిటీల ప్రతినిధులు 

Green

హైదరాబాద్:తెలంగాణ  హరిత హారం పేరుతో పచ్చదనం పెంపుతో పాటు పర్యావరణ రక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయ ప్రతినిధులు ప్రశంసించారు. మూడేళ్ళుగా చేస్తున్న ప్రయత్నాల వల్ల హరితహారం ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. త్వరలో ప్రా రంభం కానున్న 4వ విడత కార్యక్రమం విజయవంతం చేసేందుకు తమ వంతు  ప్రయత్నాన్ని చేస్తామన్నారు. ప్రధానంగా మొక్కలు నాటడంతో పాటు  నీటి వసతిని కల్పించి రక్ష ణ చర్యలు కూడా తీసుకుంటామని ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల మేరకు హైదరాబాద్ పరిధి లో గల  40కిపైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో అటవీశాఖ ఉన్నతాధికారులు గురువారం అరణ్యభవన్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత మూడేళ్లుగా చేపట్టిన హరిత హారం పనులను ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రదర్శించారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ పరిధిలో ఉన్న అన్ని నర్సరీలను, వాటి పరిధిలోని నర్సరీలకు వీటిని టై అప్ చేయడంతో పాటు నర్సరీ నిర్వహకులకు సహాయంగా ప్రత్యేక అధికారులను కూడా నియమిస్తామని చెప్పారు. వివిధ సంస్థలు కోరిన మొక్కల విషయంలో అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తామని అటవీశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయ ఆధీనంలో ఉన్న భూముల్లో హరితహారం చేపట్టడం ద్వారా పట్టణీకరణతో పాటు హైదరాబాద్ వాసుల మీద పెరుగుతున్న ఒత్తిడిని స్వచ్ఛమైన గాలితో అడ్డుకోవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయ ఒఎస్డి ప్రియాంక వర్గీస్ తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో హరితహారంపై పనిచేస్తున్న ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ సెల్ (పిఎంయు) పర్యవేక్షణలో కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పికె.ఝా తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులంతా తమ సంస్థల పరిధిలో హరితహారం కార్యక్రమాన్ని చేపడతా మని తెలిపారు. ఇందులో పలు సంస్థల ప్రతినిధులు పండ్లు, పూల మొక్కలు కావాలని విజ్ఞప్తి చేయగా మరిన్ని సంస్థల ప్రతినిధులు నివాస గృహ సముదాయాల్లో పెంచేందుకు ఔషధ మొక్కలు కూడా కావాలని కోరారు. దీనికి స్పందించిన అటవీశాఖ ఉన్నతాధికారులు వాటిని పంపిణి చేస్తామని చెప్పారు. సమావేశంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో పాటు జిహెచ్‌ఎంసి హెచ్‌ఎండిఎ, బిడిఎల్, బిహెచ్‌ఇఎల్, డిఆర్‌డిఓ, హెచ్‌ఎఎల్, ఎఎస్‌సిఐ, ఐఎస్‌ఆర్‌ఓ, ఎన్‌ఆర్‌ఎస్‌సి, ఎన్‌ఆర్‌డిఐ, డిఎన్‌ఎ ఫింగర్ ప్రింట్స్, ఎన్‌ఐఎఫ్‌టితో పాటు ఇతర సంస్థలు, విశ్వవిద్యాలయ ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

comments