Home తాజా వార్తలు 40 కిలోల గంజాయి పట్టివేత

40 కిలోల గంజాయి పట్టివేత

Cannabisహైదరాబాద్‌ : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో నగరంలో పోలీసులు భారీ ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. నారాయణగూడ ఫ్లైఓవర్‌ వద్ద మంగళవారం సెంట్రల్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది 40 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులను నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. యాకుత్‌పురాలో ఎన్నికల అధికారులువిస్తృత తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రూ. 2.38 లక్షల నగదును పట్టుకున్నారు. పట్టుబడిన నగదును సైదాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

40 Kgs Cannabis Seized in Hyderabad