Home తాజా వార్తలు 40 లక్షల ఉద్యోగాలు లక్ష్యం

40 లక్షల ఉద్యోగాలు లక్ష్యం

 కొత్త టెలికాం పాలసీకి మంత్రివర్గం ఆమోదం  అందరికీ అందుబాటులోకి బ్రాడ్‌బ్యాండ్ సేవలు :  మనోజ్ సిన్హా 

bs

న్యూఢిల్లీ : వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమకూర్చుకోవడం ద్వారా 2022 నాటికి 40 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి రూపొందించిన కొత్త టెలికాం పాలసీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ ( ఎన్‌డిసిపి) 2018 పేరుతో రూపొందించిన ఈ విధానం ద్వారా 5 జి వంటి నూతన సాంకేతిక పరిజ్ఙానంతో టెలికాం సేవలను విస్తృ తం చేయాలని లక్షంగా పెట్టుకున్నామని టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపా రు. వినియోగదారులను కేంద్రంగా చేసుకుని ఆచరించే విధానాన్ని అందుబాటులోకి తేవాలని కొత్త పాలసీ నిర్దేశించింది. బ్రాడ్ బ్యాం డ్ సేవలను అందరికి అందుబాటులోకి తేవాలని,2018లో 40 లక్షలఉద్యోగాలను కల్పించాలని ఎన్‌డిసిపి లక్షంగా పెట్టుకుం ది. ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇం డెక్స్‌లో 50వ స్థానం సాధించాలని కేంద్రం భావిస్తోంది. జాతీయ స్థూల ఆదాయంలో టెలికాం రంగం వాటా 6 శాతం ఉంది. అయితే దీనిని 8 శాతానికి పెంచాలని, దీనికోసం 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించామని కేంద్ర టెలికాం మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. ఆధునిక 5 జి టెక్నాలజీని ఉపయోగించి హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను విస్తృతం చేయాలనే ఉద్దేశంతో కొత్త టెలి కాం విధానం రూపొందించామని మంత్రి చెప్పారు.

చక్కెర పరిశ్రమకు  రూ. 5,500 కోట్ల ప్యాకేజీ

bsns

చక్కెర పరిశ్రమ కోసం రూ. 5,500 కోట్ల ప్యాకేజీకి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చక్కెర పండించే రైతులకు అందించే సహా యం, చక్కెర ఎగుమతి చేసే మిల్లర్లకు ఇచ్చే సబ్సిడీని రెండింతలు పెంచింది. 5 మిలియన్ టన్నుల వరకు ఎగుమతి చేసే వారికి 2018, 2019 ఆర్థిక సంవత్సరానికి ఈ సబ్సిడీ వర్తిస్తుంది. ఆహార మంత్రిత్వ శాఖ చేసిన ఈ సిఫారసులను మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ ( సిసిఇఎ)  ఆమోదించింది. దేశంలో పేరుకుపోయిన చక్కెర నిల్వలను ఎగుమతి చేయడానికి, చక్కెర రైతులకు మిల్లులు బకాయిపడిన రూ. 1300 కోట్లు చెల్లించడానికి ఈ ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం రూ. 5,538 కోట్ల రూపాయల్లో రూ.1,375 కోట్లు చక్కెర ఎగుమతి చేసే మిల్లులకు సబ్సిడీగా ప్రకటించింది. మిగతా డబ్బులు చెరుకు పండించే రైతుల కొరకు కేటాయించారు. ఈ మొత్తం రైతుల వ్యక్తిగత ఖాతాల్లో జమచేస్తారు. దేశంలో 2019 లో కొన్ని రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్  ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చెరకు పండించే రైతుల కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత జూన్ లో చక్కెర పరిశ్రమ కోసం కేంద్రం రూ.8,5౦౦ కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీ రెండవది. దేశంలో 2017,2018 మధ్యకాలంలో  గతంలో ఎన్నడూ లేని విధంగా 32 మిలియన్ టన్నుల చక్కెర  ఉత్పత్తి జరిగింది. ఈ నెల వరకు 10 మిలియన్ టన్నుల చక్కెర నిల్వలున్నాయి.