Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

చెరువుల అభివృద్ధికి పెద్దపీట

 ktr

40 చెరువులను రూ. 441కోట్లతో అభివృద్ధి

 గండిపేట రిజర్వాయర్ సుందరీకరణ కోసం రూ. 100కోట్లు
 రెండు మూడు సంవత్సరాలు ట్యాక్స్ పెంచబోం

 వంద అపార్టుమెంట్లు దాటితే ఎస్‌టిపి కట్టాలి: మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్/ నార్సింగి: తెలంగాణ రాష్ట్రంలో చెరువుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. నెక్నాంపూర్ చెరువు అభివృద్ధి పనులకు శుక్రవారం మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 46వేల చెరువులు ఉన్నాయన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 40చెరువులను రూ.441కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వంద సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నీరు వృథాగా పోకుండా గొలుసు కట్ట చెరువులను నిర్మించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్షం కారణంగా గొలుసు క ట్టు చెరువులు చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టిందన్నా రు. చెరువుల అభివృద్ధి చేసి కమిటీలకు అప్పగిస్తామని, నిర్వహణ బాధ్యత కమిటీలదని, ఈ చెరువులను ఆక్రమణలకు గురి కాకుండా, మూసీ సుందరీకరణకు, చెరువు చు ట్టూ   నిర్మాణాలు చేపట్టకుండా సిఈఓను ఐపిఎస్ భారతీ హోలికేరీ నియమిస్తున్నట్లు తెలిపారు. చెరువులను కాపాడటానికి జీహెచ్‌ఎంసీ తరుపున సిబ్బందిని నియమిస్తామన్నారు. వారికి ఒక సైకిల్ ఇవ్వడం, డ్రెస్ కోడ్ ఉంటుంద ని తెలిపారు. వీరు లేక్ సుందరీకరణకోసం కృషి చేస్తారన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో 100 అపార్టుమెంట్స్ దాటితే ఎస్‌టిపి కట్టాల్సి ఉంటుంది కానీ కట్టడం లేదని, ఇప్పటి నుండి కట్టాలి అన్నారు. నిర్మాణం చేసే బిల్డర్ ఎస్‌టిపి కట్టే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గండిపేట మండలంలో డిగ్రీ కళాశాల నిర్మించాలని రా జేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కోరారని త్వరలోనే అ యిపోతుందన్నారు. ఇప్పటిలో రెండు మూడు సంవత్సరా లు టాక్స్ పెంచబోమని, గ్రామపంచాయతీలో ఎంత చెల్లిస్తున్నారో అంతే టాక్స్ ఉంటుందని చెప్పారు. గండిపేట రిజర్వాయర్ నిర్మాణం జరిగి 100ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రిజర్వాయర్ సుందరీకరణ కోసం రూ.100కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. గండిపేట రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నామని తెలిపా రు. పంచాయతీల గడువు ముగిసిన తర్వాత రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలోని మణికొండ, పుప్పాలగూడ, నెక్నాంపూర్ గ్రామాలు మున్సిపాలిటీగా ఏర్పా టు అవుతుందన్నారు. ఎంపి విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు, ప్రభుత్వం కలిసి నెక్నాంపూర్ పెద్ద చెరువు అభివృద్ధ్ది చేశామన్నారు.  ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఇప్పటికే రూ.100కోట్ల అభివృద్ధి చేసామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన త రువాత మిషన్‌కాకతీయలో భాగంగా చెరువులను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ హయాం లో అభివృద్ధి ఏం జరిగిందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండిఏ కమిషనర్ చిరంజీవులు, గ్రేటర్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపిపి తలారిమల్లేష్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రామేశ్వరం నర్సింహ, నాయకులు మాలతీనాగరాజు, చంద్రశేఖర్‌రెడ్డి, నిలేష్, శ్రీరాములు, బషీర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments