Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ప్రతి పంచాయతీకి 40వేల మొక్కలు లక్ష్యం

మున్సిపాలిటీల్లో స్మృతి వనాలు
ఎంపిడివోలదే బాధ్యత కలెక్టర్ ఇ శ్రీధర్
Collector1

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: వచ్చే గ్రామ పంచాయతీలో 40వేల మొక్కలు నాటడానికి లక్షం నిర్దేశించినందున అవసరమైన మైక్రో ప్లానిం గ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇ.శ్రీధర్ ఎంపి డిఓలను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో తెలంగాణకు హరితహారం, ఉపాదిహామిలో కూలీ చెల్లింపు లు,ఆసరా ఫెన్షన్ల పంపిణీ, నగదురహిత లావాదేవీ లపై ప్రజలకు అవగాహన తదితర అంశాలపై డిఆర్ డిఏ, ఎంపిడివోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో హరితహారం అత్యంత ప్రధానమైందని అందుకే ప్రతి మంగళవారం రాష్ట్ర స్థాయి అధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్‌లు నిర్వహిస్తున్నారన్నారు.

ప్రతి వారం ఈ కార్యక్రమంపై మీరిచ్చే నివేదికల ఆధా రంగానే పై అధికారులకు తాను నివేధిస్తాన న్నారు. గత సంవత్సరం పలు కారణాల వలన జిల్లాలో లక్ష్యాన్నిచేరుకోలేదని, నాటిన మొక్కలలో పూర్తి స్థాయిలో అన్నింటిని కాపాడుకోలేకపోయామని, జియో ట్యాగింగ్‌లో వెనకబడి ఉన్నామన్నారు. అయి తే చెరువుల్లోకి నీటిని నింపినందున జిల్లాలో ఈ సంవత్సరం మొక్కల పెంపకంలో లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్న అంచనాలతో ప్రభుత్వం ఉందన్నారు. గత సంవత్సర ప్రణాళిక లోపాలు సరిచేసుకుంటు ఈ సంవత్సరం పక్కాగా ప్రణాళికలు, వాటి రక్షణ విధా నం, నాటడానికి స్థలాల గుర్తింపు, వాటి మైక్రో ప్లానింగ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని నివేదికలు తయారు చేసుకోవాలన్నారు. స్మృతి వనా లను మున్సిపాలిటీలో ఏర్పాటు చేయాలన్నారు.

ఉపాధి, ఆసరాకూలీలకు పని కల్పించడం లేదని ఫిర్యాదులు రాకుండా కూలీలందరికి పని కల్పించి, ఎప్పటికప్పుడు సకాలంలో కూలీ అందేలా చూడాలన్నారు. కూలీ డబ్బులు, ఆసరా ఫెన్షన్‌లు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఎంపిడివోలు ముఖ్య పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ప్రతి ఎంపిడివో ఒక గ్రామాన్ని, ప్రతి మున్సిపాల్ కమిషనర్ ఒక వార్డును దత్తత తీసుకొని ఆ ప్రాంతాల్లో నగదు రహితంగా లావాదేవీలు జరిగేలా చూడాలన్నారు. గ్రామాల్లో పారిశుద్య కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించేలా పర్యవేక్షణ చేయాలని, గ్రామాలను బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా తీర్చిది ద్దడానికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ సమా వేశంలో డిఆర్‌డిఓ వెంకటయ్య గౌడ్, డిటిడబ్లూఓ మణ్య నాయక్, ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments