Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

లీటర్ పెట్రోల్‌తో 410 కిలోమీటర్ల ప్రయాణం

24

ఒక లీటర్ పెట్రోల్‌తోనే ఈ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసా? ఇప్పటికే రోజు రోజుకి పెరుగుతున్న ధరలు, దానికి తోడు ఇంధన కొరతతో అల్లాడుతున్న ప్రపంచానికి ఓ మార్గాన్ని చూపించాడు కర్ణాటకకు చెందిన ఓ కుర్రాడు. ఈయన తయారు చేసిన బైక్‌లో 1 లీటర్ పెట్రోల్ పోస్తే ఇది ఏకంగా 410 కిలో మీటర్లు ప్రయాణిస్తుందంటున్నాడు. సాధారణంగా మనం వాడే బైక్స్ 50 నుండి 70 కిలోమీటర్ల వరకు వెళ్తాయి. కాని కర్ణాటక లోని ఒక మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉమేష్. తను తయారు చేసిన బైక్ IC టెక్నాలజీ, ఇంజన్, రెండు బ్యాటరీలు, గేర్ బాక్స్, DC మెటర్ ఆధారంగా( ఇంజనీరింగ్ డిజైన్ ప్రక్రియ పద్ధతుల కలిపి 40 వేల వ్యయంతో) దీనిని రూపొందించాడు. సాధారణ బైక్‌లో 1 లీటర్ పెట్రోల్ పోస్తే అవి 70 కిలోమీటర్లు వరకు వెళ్లవచ్చు కాని ఉమేష్ తయారు చేసిన బైక్ మాత్రం 410 వరకు వెళ్లవచ్చని వెల్ల్లడిస్తున్నాడు. భవిష్యత్తులో ఇంధన కొరతను నివారించడానికి ఈ బైక్ ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు.

Comments

comments