Home కుమ్రం భీం ఆసిఫాబాద్ దహెగాంలో 43 మంది బైండోవర్

దహెగాంలో 43 మంది బైండోవర్

STAND

మన తెలంగాణ /దహెగాం : మండలంలో వేరు వేరుగా సత్ప్రవర్తన నిమిత్తం 43 మందిని సోమవారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు దహెగాం ఎస్సై దీకోండ రమేష్ తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం నేరస్తుల సమగ్ర సర్వేలో బాగంగా పాత నేరస్తులైన  వివిద గ్రామాలకు చేందిన 43 మంది అయిన మర్రిపల్లిలో 10 మంది,దహెగాం లో 5 మంది, కల్వడలో 9 మంది,ఇట్యాల 1,బీబ్రాలో 6,దేవులగుడ లో 12 మంది తహసీల్దార్ బికర్ణదాస్ ఎదుట బైండోవర్ చేసినట్లు సంవత్సరంలో ఎదైన నేరానికి పాల్పడితె లక్ష రూపాయలు జరిమానా విదిస్తామని తహసీల్దార్ హెచ్చరించినట్లు తెలిపారు. పాత నేరస్తులు ఎలాంటి అసాంఘీక కార్యకలపాలకు పాల్పడకుడదని అన్నారు.నాటుసారా అమ్మిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హేచ్చరించారు.