Home తాజా వార్తలు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాం : ఈటల

43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాం : ఈటల

ETALA

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖజానాపై 3,400 కోట్ల భారంపడుతందని తెలిసినప్పటికీ సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఏరియర్స్ చెల్లించలేదని తెలిపారు. తొమ్మిది నెలల ఏరియర్స్ ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను దశలవారీగా క్రమబద్దీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఏ పార్టీకి లేదన్నారు.