Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మున్సిపాలిటీలకు రూ.45 కోట్లు మంజూరు

45 crores Goverment Provided To municipality Department

వికారాబాద్ ః తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్ఛర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద జిల్లాలో మున్సిపాలిటీల అభివృద్ధికి దండిగా నిధులు మంజూరు చేశారు. జిల్లాలో వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. టియుఎఫ్‌ఐడి పథకానికి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పథకం ద్వారా పట్టణాల అభివృద్ధికి నిధులు వెచ్చించనున్నారు. వికారాబాద్ మున్సిపాలిటీకి రూ.20 కోట్లు మంజూరైనట్లు అధికారవర్గాల సమాచారం. త్వరలో ఈ నిధులకు టెండర్లు పిలిచే అవకాశాలు ఉన్నాయి. పట్టణానికి కావాల్సిన మౌళిక సదుపాయాలతో పాటు శివసాగర్ జలాశయాన్ని మినీ ట్యాంక్‌బండ్‌గా ఏర్పాటు చేసేందుకు నిధులు వెచ్చించనున్నారని భావిస్తున్నారు. తాండూరులో గొల్ల చెర్వు అభివృద్ధికి ప్రత్యేక నిధులు వచ్చిన విషయం తెలిసిందే. దానిమాదిరిగా వికారాబాద్‌లో పురాతన శివసాగర్‌ను ఆధునీకరించనున్నారు. ఇలా ఉండగా తాండూరు మున్సిపాలిటీకి రూ.50 కోట్లు ఇస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి కెటిఆర్ ఇచ్చిన హామీ మేరకు తొలివిడతగా రూ25 కోట్లు వచ్చాయి. వాటిని పట్టణానికి ఆనుకుని ఉన్న ఆర్‌అండ్‌బి రహదారుల అభివృద్ధికి ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి.

Comments

comments