Home అంతర్జాతీయ వార్తలు జింబాబ్వేలో రోడ్డు ప్రమాదం: 47 మంది మృతి

జింబాబ్వేలో రోడ్డు ప్రమాదం: 47 మంది మృతి

Zimbabwe Bus Accident

హరారే: జింబాబ్వేలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొని 47  మంది దుర్మరణం చెందారు. బస్సు 67 మంది ప్రయాణికులతో మ్యూటరే నుంచి హరారేకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసు ఉన్నతాధికారి పాల్ న్యాతి తెలిపారు. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డినట్టు సమాచారం. ఈ ప్రమాదం రుసాపే నగరానికి అతి దగ్గరలో జరిగిందని వెల్లడించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని పోలీసుల వెల్లడించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. గత సంవత్సరం ఉత్తర జింబాబ్వేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 43 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

47 killed in Zimbabwe Bus Accident  

Telangana news