Search
Thursday 15 November 2018
  • :
  • :

కేరళలో వరదలు : 483 మంది మృతి

483 People died with Floods in Kerala

తిరువనంతపురం : ఇటీవల కేరళను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. భారీ వరదల కారణంగా రాష్ట్రంలో 483 మంది చనిపోయారని ఆ రాష్ట్ర సిఎం పినరయి విజయన్ వెల్లడించారు. గురువారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో ఆయన వర్షాలు , వరదలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వరదల సమయంలో సుమారు 14.50 లక్షల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారని ఆయన చెప్పారు. వరదల కారణంగా 15 మంది గల్లంత్తయ్యారని పేర్కొన్నారు. మొత్తం 57 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. 14 రోజుల్లో కేరళకు రూ.713.92 కోట్ల విరాళాలు వచ్చాయని తెలిపారు. కేరళకు పునర్‌వైభవం తీసుకొచ్చేందుకు చాలా సమయం పడుతుందని ఆయన తెలిపారు. ప్రజలను కాపాడేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్న భారత ఆర్మీ, నావికాదళం, బిఎస్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఐటిబిపి జవాన్లు, జాలర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

483 People died with Floods in Kerala

Comments

comments