Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

చరిత్రకెక్కనున్న గజ్వేల్ మహా హరితహారం

harish

1న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా 4వ విడత హరితహారం ప్రారంభం   హరీశ్

మన తెలంగాణ/గజ్వేల్ : రాష్ట్రంలో నాలుగో విడత హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మొక్క నాటి శ్రీకారం చుడతారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. హరితహారం సన్నాహక కార్యక్రమంలో భాగంగా పాతూరు అటవీ ప్రాంతాన్ని, ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణ, గజ్వేల్‌లో ఇందిరాపార్కు, ఐఒసి తదితర ప్రాంతాలను మంత్రి ఆదివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గజ్వేల్‌లో సిఎం చేతుల మీదుగా ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమం చరిత్రాత్మకంగా నిలిచిపోనుందన్నారు. మహా హరితహారం ప్రజలకు గొప్ప వరంగా ఆయన అభివర్ణించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కోసం ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. బుధవారం ఉదయం సరిగ్గా 11 గంటలకు మున్సిపల్ పరిధిలో ఒకేసారి లక్షా 116 మొక్కలు నాటి స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు,అధికారులు సరికొత్త రికార్డు సృష్టించనున్నారన్నారు. ఉదయం 11గంటలకు అన్ని మజీదులలో పెద్ద శబ్దంతో సైరన్‌ను మోగిస్తారని వెంటనే ఇందిరా పార్కు వద్ద సిఎం సహా మున్సిపల్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువత, మహిళలు ఎక్కడికక్కడ మొక్కలు నాటుతారన్నారు. గజ్వేల్‌లో మొక్కను నాటిన అనంతరం సిఎం గజ్వేల్ నుంచి రహదారిపై నాటిన మొక్కలను పరిశీలిస్తూ ప్రజ్ఞాపూర్‌కు వెళ్లి అక్కడ కూడా మరో మొక్కను సిఎం నాటుతారని మంత్రి హరీశ్‌రావు వివరించారు. మొక్కలు నాటే ప్రాంతాలను బ్లాకులుగా విభజించుకుని ఒక్కో బ్లాకుకు ఒక ప్రజాప్రతినిధి, ఒక అధికారి చొప్పున మొక్కలునాటే స్థలంలో ఉండాలన్నారు. ఆరోజు ఎలాంటి సభలు సమావేశాలుండవని సిఎం వచ్చాడన్న హడావిడితో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అర్థ్దాంతరంగా వదల వద్దన్నారు.
బహిరంగ సభ లేదు : ముఖ్యమంత్రి కెసిఆర్ రాక సందర్భంగా గజ్వేల్‌లో ఎలాంటి బహిరంగ సభ జరుపుకోవటంలేదని మంత్రి హరీశ్‌రావు స్ఫష్టం చేశారు. సిఎం చేతుల మీదుగా గజ్వేల్ ఇందిరా పార్కు వద్ద మొక్కను నాటటం, ప్రజల భాగస్వామ్యంతో మహా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయటం వరకే ప్రధాన కార్యక్రమంగా ఉంటుందన్నారు. మరో 10,15 రోజుల్లో మంచి రోజులు చూసుకుని సిఎం గజ్వేల్‌కు మళ్లీ వస్తారని, అప్పుడు వివిధ అభివృద్ధ్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారన్నారు, ఆ సందర్భంగ బహిరంగా సభను నిర్వహించుకుంటామని తెలిపారు. హరితహారం కార్యక్రమా న్ని విజయ వంతం చేయటానికి ప్రజలు స్పందించి పరిపూర్ణ స హకారాన్ని అందించటం పట్ల మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్య క్తం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే కార్యక్రమాలు విజయవంతమవుతాయన్నారు. నాటిన ప్రతి మొక్క బతికి ఉన్నపుడే హ రితహారం విజయవంతమైనట్లన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్ట ర్ వెంకట్రాంరెడ్డి, గడా ప్రత్యేక అధికారి హనుమంతరావు, ఎం పి కొత్త ప్రభాకర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు భూపతిరెడ్డి, భూ మిరెడ్డి, లక్షన్‌రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ పాల్గొన్నారు.

Comments

comments