Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

పంజాబ్ బోణి

Maxwell

ఇండోర్: వేదికగా పంజాబ్, పుణె మధ్య జరిగిన నాల్గో మ్యాచ్‌లో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పుణె విధించిన 164 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే అలవొకంగా చేధించింది. పంజాబ్ కెప్టెన్ మ్యాక్స్‌వెల్ కేవలం 20 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్ల సహాయంతో అజేయంగా 44 పరుగులు చేసి రాణించాడు. మరో బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ కూడా మెరుపులు మెరిపించాడు.

మిల్లర్ 27 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక బౌండరీ సహాయంతో 30 పరుగులు చేశాడు. ఓపెనర్ హసీం ఆమ్లా (28), అక్షర్ పటేల్(24) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అంతకుముందు పుణె జట్టులో బెన్ స్టోక్స్ (50) అర్ధశతకం చేయగా, మనోజ్ తివారీ(40), స్మిత్(26) పరుగులు చేశాడు. పుణె బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ రెండు వికెట్లు తీశాడు.

Comments

comments