Home తాజా వార్తలు ఢిల్లీ టెస్ట్‌లో భారత్ విజయభేరి

ఢిల్లీ టెస్ట్‌లో భారత్ విజయభేరి

Ashwinఢిల్లీ టెస్ట్: ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్ట్‌లో 481 పరుగుల భారీ లక్షచేధనతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీ జట్టు చివర్లో తడబడింది. డి విలాస్(13), డివిలియర్స్(43), అబాట్(0) వికెట్లను వెంటవెంటనే పారేసుకుని పీకలోతు కష్టాల్లో పడింది. యాదవ్ వరుస ఓవర్లలో డి విలాస్, అబాట్‌లను పెవిలియన్‌కు పంపగా, డివిలియర్స్‌ను అశ్విన్ అవుట్ చేశాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 143 పరుగులకే కుప్పకూలడంతో భారత్ 337 పరుగుల భారీ తేడాతో గెలిచింది. దీంతో నాల్గు టెస్టుల సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకుంది. భారత బౌలర్లలో అశ్విన్‌కు 5 వికెట్లు, జడేజాకు 2 వికెట్లు, ఉమేష్ యాదవ్‌కు 3 వికెట్లు దక్కాయి. వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు నమోదు చేసిన రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. సిరీస్ మొత్తంలో 32 వికెట్లు తీసిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కింది. భారీ విజయం నమోదు చేసిన టీం ఇండియా ఐసిసి ర్యాంకింగ్‌లో రెండో స్థానానికి ఎగబాకింది.

c1

c2

c3

c4

c6

c7

c8

c9