Search
Sunday 23 September 2018
  • :
  • :

అమెరికా నుంచి 5 లక్షల భారతీయులు వెనక్కి?

BSNSవాషింగ్టన్: అమెరికాలో ప్రతిపాదిత హెచ్1బి వీసా నింబంధనల సవరణ బిల్లు గనుక అమల్లోకి వస్తే 5 లక్షల మంది భారతీయులు ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డ్ పొందేందుకు ఎదురుచూసేవారికి ఇక మీదట పొడగింపు ఇవ్వకూడదని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రతిపాదించింది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన హామీ మేరకు హెచ్1-బీ వీసా పొడగింపు ఇవ్వకూడదని.. అందుకు కొత్త నిబంధనలు తీసుకురావాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీస్ పేర్కొంటోంది. ప్రస్తుత చట్టం ప్రకారం విదేశీ ఉద్యోగులు హెచ్1-బి  వీసా పొందితే మూడేళ్ల కాలపరిమితితోపాటు మరో మూడేళ్ల పొడగింపు లభిస్తుంది. మొత్తం ఈ ఆరేళ్ల కాలంలో వారికి సంబంధించిన గ్రీన్‌కార్డ్ అప్లికేషన్ పెండింగ్‌లో ఉంటే అది పూర్తయ్యేవరకూ పొడగింపు లభిస్తుంది. అయితే ప్రతిపాదిత సవరణల ప్రకారం ఇప్పుడు అలాంటి అవకాశం లభించదు. గ్రీన్‌కార్డు పెండింగ్‌లో ఉన్నప్పుడు వీసాను పునరుద్ధరించకుండా చేయడం ఈ ప్రతిపాదన ఉద్దేశ్యం. ఈ కారణంగా అలాంటి వారు అమెరికాను వదిలివెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం హెచ్1-బి నిబంధనల్లో మార్పులు చేస్తే ఇతర దేశస్థుల కంటే భారతీయులే ఎక్కువగా నష్టపోతారని నిపుణులు అంటున్నారు.

Comments

comments