Home సినిమా ‘అఖిల్’కు 5 భారీ సెట్టింగ్‌లు

‘అఖిల్’కు 5 భారీ సెట్టింగ్‌లు

Akhil-Path-BiGవి.వి.వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అఖిల్’. నితిన్, సుధాకర్‌రెడ్డిలు నిర్మాతలు. ఆస్ట్రియా, స్పెయిన్‌లలోని అందమైన లొకేషన్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలను చిత్రీకరిం చడం జరిగింది. ప్రస్తుతం అఖిల్ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో వేసిన ఐదు భారీ సెట్స్‌లో జానీ బాస్టర్ నేతృత్వంలో ఈ ఇంట్రడక్షన్ సాంగ్‌ని చాలా గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నారు.  ఈ చిత్రం ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ లహరి మ్యూజిక్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. ఈ ఆడియోను అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా ఈనెల 20న హైదరాబాద్ గచ్చీబౌలి స్టేడియంలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.  ముందుగా వినాయక చవితి సందర్భంగా ఒక పాటను విడుదల చేశారు. అనూప్‌రూబెన్స్ సంగీతంతో కృష్ణచైతన్య రాసిన ఈ గీతం ‘హే అఖిల్…’ అనే పాటను రాహుల్ పాండే, అనూప్ రూబెన్స్‌లు పాడారు. ఈ సందర్భంగా లహరి మ్యూజిక్ అధినేత జి.మనోహర్ నాయుడు మాట్లాడుతూ “బాహుబలి ఆడియో తర్వాత మరో సంచలన చిత్రం అఖిల్ ఆడియో హక్కులు కూడా మాకు రావడం సంతోషంగా ఉంది. హీరో అఖిల్ ట్వీట్ చేయడంతో ఈ పాటను విడుదల చేశాం. టైటిల్ సాంగ్‌గా వచ్చే ఈ పాట చిత్రంలో ఒక హైలైట్‌”అని అన్నారు.