Home తాజా వార్తలు బస్సు ప్రయాణికులే టార్గెట్…

బస్సు ప్రయాణికులే టార్గెట్…

Robbery Gang

హైదరాబాద్: రద్దీగా ఉన్న ఆర్టీసీ బస్సులే వీరి టార్గెట్. సాదారణ ప్రయాణికుల్లా బస్సులోకి ఎక్కి ఎవరికి తెలియకుండా బంగారు గొలుసులు అపహరిస్తున్న తొమ్మిది మంది ముఠా సభ్యుల్లో సైఫాబాద్ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ముఠాలో మరో నలుగురిని పట్టుకోవాల్సి ఉంది. నిందితుల్లో ఒకడు పీడీ యాక్ట్ నేరస్తుడు. మాంగార్‌బస్తీకి చెందిన ఈ చైన్ గ్యాంగ్ వివరాలను సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి, డీఐ నర్సింహులు, ఎస్ఐ ప్రసాద్‌తో కలిసి మీడియాకు వివరించారు. మల్లేపల్లిలోని మంగార్‌బస్తీకి చెందిన కాంబ్లే శ్యాంసుందర్ అలియాస్ శ్యామ్ (24) గ్యాంగ్‌లీడర్. ఇతని చేతికింద మరో ఎనిమిది మంది ముఠా సభ్యులుగా పనిచేస్తారు. ఆర్టీసీ బస్సులో ఈ తొమ్మిది ప్రయాణిస్తూ ప్రయాణికులను దోచుకుంటారు. పలు పోలీస్ స్టేషన్లలో వీరిపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. శనివారం లక్డీకాపూల్ వద్ద బస్సు స్టాప్ వద్ద వేచి ఉన్న ఈ ముఠా సభ్యుల్లో ఐదుగురు నిందితులను సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించిన పోలీసులు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,22,500 విలువైన బంగారు ఆభరణాలను రికవరి చేశారు. బాధితుల ఇచ్చిన ర్యాదుల మేరకు దర్యాప్తు పోలీసులు  చేస్తున్నారు.

5 Members Robbery Gang Arrested by Hyderabad Police