Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

అమెరికాలో కాల్పుల కలకలం

USఫ్లోరిడా: అమెరికాలోని ఓర్లాండోలో  సోమవారం మళ్లీ కాల్పులు కలకలం చోటుచేసుకుంది. అయితే ఈసారి జరి గిన ఈ కాల్పులు మాత్రం ఉగ్రవాదానికి చెందినవి   కావు. కాకపోతే పనిప్రదేశానికి చెందిన హింసాత్మక కాల్పులు. ఏప్రిల్‌లో ఓ ఫ్లోరిడా  కంపెనీ నుంచి ఉద్వాసానికి గురైన వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో కనీసం ఐదుగురు కార్మికులు చనిపోయారు. నలుగురు అక్కడిక క్కడే చనిపోగా ఐదో వ్యక్తి ఆసుపత్రిలో చనిపోయాడు. కాల్పులకు పాల్పడిన 46  ఏళ్ల వయస్సున షూటర్‌ను అధికారులు ఇంకా గుర్తించలేదు. అయితే అతడి వద్ద నుంచి తుపాకీని, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతడిని అతడిని చుట్టుముట్టగా తనని తాను కాల్చుకుని చనిపోయాడు.   ఫోర్‌సిత్ రోడ్‌లోని పారిశ్రా మిక ప్రాంతంలో జరిగిన ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అత్యవసర వాహనాలతో ఓర్లాండోకు చెందిన వింటర్ పార్క్ శివారు ప్రాంత దారిపొడవునా వాలిపోయాయి. పూర్తి వివరాలను అసలేమిటో తెలిసాక వివరిస్తానని ఆరేంజ్ కౌంటీ షెరీఫ్ తెలిపారు. ప్రమాద స్థలిని ఆరేంజ్ కౌంటీ మేయర్ థెరెస్సా జాకబ్ సందర్శించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ఆరేంజ్ కౌంటీ షెరీఫ్  జెర్రీ డెమింగ్స్ తన అధికారిక ట్వీట్ ద్వారా తెలిపారు.

Comments

comments