Home రంగారెడ్డి చెన్నారెడ్డిగూడలో అలుముకున్న విషాద ఛాయలు

చెన్నారెడ్డిగూడలో అలుముకున్న విషాద ఛాయలు

5 People Dies In Road Accident Rangareddy District

మనతెలంగాణ/మంచాల : వ్యవసాయం చేస్తే తప్ప వారి కుటుంబాలు పూటగడవని పరిస్థితి మృతులంతా పేద కుటుంబాలకు చెందిన వారే కావడంతో మంచాల మండల పరిధిలోని  చెన్నారెడ్డిగూడలో పెద్ద ఎత్తున విషాద ఛాయలు అలుముకున్నాయి. సోమవారం ఉదయం మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గేటు సమీపంలో కారు ఆటోను ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో మృతి చెందిన చీమల మమత(30), చీమల సుజాత(35), ఆంబోత్ హస్లీ(45), ఆంబోత్‌మారు(48), ఆటోడ్రైవర్ వంగాల శ్రీను(26)ల మృత దేహలకు పోస్టుమార్టం నిర్వహించి వారి అంత్యక్రియలను చెన్నారెడ్డిగూడ గ్రామంలో నిర్వహించారు.వారిని చివరి చూపు చూడటానికి మృతుల బందువులు గ్రామస్థులు పెద్ద ఎ త్తున తరలివచ్చారు.మృతి చెందిన చీమల మమతకు ఓ కొడుకు ఓ కూతురు చిన్న వయస్సు కలిగి ఉన్నారు.చీమల సుజాతకు పెళ్లీడుకు వచ్చిన కూతురు ఓ కోడుకు ఉన్నారు.ఆంబోత్ హస్లీ కి పెళ్లీడుకు వచ్చిన కూతుర్లు కోడుకులు ఉన్నారు.ఆటో డ్రైవర్ శ్రీను వివాహం కాలేదు..
మృతుల కుటుంబాలను పరామర్షించిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు
రొడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలను ఇబ్రహింపట్నం ఎమ్మేల్యే మంచిరెడ్డికిషన్‌రెడ్డి,కాంగ్రేస్‌పార్టి జిల్లా అద్యక్షులు క్యామమల్లేష్,సిపియం జిల్లాకార్యదర్షివర్గసభ్యులు పగడాలయాదయ్య,మాజీ ఎమ్మేల్యే మస్కు నర్సింహ్మ,మాజీ ఎమ్మేల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి,టిడిపి రాష్ట్రనాయకులు కొంగరవిష్ణువర్ధన్‌రెడ్డి,చీరాల రమేష్, మంచాల జడ్‌పిటిసి భూపతిగళ్ల మహిపాల్,ఎంపిపి జి జయమ్మ,వైస్‌ఎంపిపి దన్నే భాషయ్య,కాంగ్రేస్‌పార్టినాయకులు దండేం రాంరెడ్డి,టిఆర్‌యస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి,ఇసి శేఖర్‌గౌడ్,తో పాటు రాజకీయపార్టీలనాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.