Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో కాల్పులు … ఐదుగురు మృతి

అమెరికాలో కాల్పులు … ఐదుగురు మృతి

Americaఅమెరికాలో కాల్పుల ఘ‌ట‌న కలకలం రేపింది. ఇలియ‌నాస్ రాష్ట్రంలోని అరోరా న‌గ‌రంలో ఉన్న ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్‌లో గ్యారీ మార్టిన్ అనే సాయుధుడు కాల్పలు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. 10 మంది గాయ‌ప‌డ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో మార్టిన్ హ‌త‌మ‌య్యాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు కూడా గాయ‌ప‌డ్డారు. హెన్రీ ప్రాట్ కంపెనీలో ప‌నిచేస్తున్న మార్టిన్  గ‌న్‌తో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా కాల్పులు జ‌రిపిన‌ట్లు ఆ కంపెనీ ఉద్యోగులు తెలిపారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

5 People Shot Dead in America