Home అంతర్జాతీయ వార్తలు కాలిఫోర్నియాలో కాల్పులు : ఐదుగురు మృతి

కాలిఫోర్నియాలో కాల్పులు : ఐదుగురు మృతి

5 People Shot Dead in California

న్యూయార్క్ : అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. బేకర్ పీల్డ్‌లో దుండగుడు కాల్పులు జరపడంతో ఓ మహిళతో సహా ఆమె కుటుంబ సభ్యులు నలుగురు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. కాల్పులు జరిపిన దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

5 People Shot Dead in California